: బంగ్లాదేశ్ లో సీరియల్ బ్లాస్ట్స్.. ఆరుగురి మరణం!
బంగ్లాదేశ్ రాజధాని ఢాకాకు 240 కిలోమీటర్ల దూరంలో ఉన్న సైహెట్ ప్రాంతం వరుస బాంబు పేలుళ్లతో అట్టుడికింది. ఈ పేలుళ్లలో ఆరుగురు అక్కడికక్కడే మరణించగా, మరో 40 మందికి పైగా గాయపడ్డారు. మృతుల్లో ఇద్దరు పోలీసులు కూడా ఉన్నారని, తొలుత సూసైడ్ బాంబర్లు రెండుసార్లు ఢాకా ఎయిర్ పోర్టుపై దాడికి ప్రయత్నించగా అడ్డుకున్నామని, ఆపై సైహెట్ ప్రాంతంలో సీరియల్ బ్లాస్ట్స్ జరిగాయని అధికారులు తెలిపారు.
సహాయక చర్యలు సాగుతున్నాయని, గాయపడిన వారిని ఢాకాకు తరలించామని తెలిపారు. కాగా, సూసైడ్ బాంబర్ నల్లని పాలిథిన్ కవర్ తో వచ్చాడని, చికిత్స పొందుతున్న క్షతగాత్రులు తెలిపారు. మరో ఇద్దరు ఉగ్రవాదులు బైక్ పై వస్తూ, బాంబులను విసిరారని తెలిపారు. సైహెట్ పేలుళ్లపై మరింత సమాచారం తెలియాల్సివుంది.