: శశికళ పేరు చెప్పి ఓట్లు అడగవద్దు: నేతలకు దినకరన్ సూచన


ఆర్కే నగర్ నియోజకవర్గంలో శశికళ వర్గం నుంచి 'అన్నాడీఎంకే అమ్మ' పార్టీ తరఫున బరిలోకి దిగిన టీటీవీ దినకరన్, ప్రచారం చేస్తున్న నేతలకు కీలక సూచనలు చేశారు. పార్టీ ప్రధాన కార్యదర్శి శశికళ పేరును ప్రచారంలో వినియోగించవద్దని, ఆమె పేరు చెప్పి ఓట్లను అడగవద్దని అన్నారు. ప్రచార బ్యానర్లలో ఎంజీఆర్, జయలలిత ఫోటోలు పెద్దవిగా ఉంచాలని, తనది చిన్న ఫోటో చాలని సూచించారు. కాగా, కరపత్రాల్లో శశికళ పేరు కనిపించినా, ఆమె ఫోటోలతో బ్యానర్లు కట్టినా, ఆర్కే నగర్ ప్రాంతంలో ప్రజలు వాటిని చించేస్తున్నారు. శశికళపై ప్రజల్లో వ్యతిరేకత ఉన్నందున, ఆ ప్రభావం తనపై పడరాదన్న భావనతోనే దినకరన్ ఈ సూచనలు చేసినట్టు సమాచారం.

  • Loading...

More Telugu News