: మా బాబాయ్ కి మద్దతివ్వం: యువన్ శంకర్ రాజా


చెన్నై, ఆర్కే నగర్ నియోజకవర్గ ఉప ఎన్నికల్లో బీజేపీ తరఫున పోటీ చేస్తున్న తన చిన్నాన్న గంగై అమరన్ కు తాను మద్దతివ్వడం లేదని సంగీత దర్శకుడు యువన్ శంకర్ రాజా వ్యాఖ్యానించాడు. సినీ ప్రముఖులు, వ్యాపారుల మద్దతు కోరుతూ ఆయన ప్రచారం సాగిస్తుండగా, ఆయన గెలిస్తే స్వాగతిస్తాను తప్ప, ఎలాంటి మద్దతూ ఇవ్వబోనని యువన్ తన ట్విట్టర్ ఖాతా ద్వారా వెల్లడించారు. కాగా, తన తండ్రి ఇళయరాజాను ఉద్దేశించి గంగై అమరన్ చేసిన విమర్శల కారణంగానే యువన్ ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది.

  • Loading...

More Telugu News