: జర భద్రం!.. ఎండలు ఇంకా మండుతాయ్.. హెచ్చరించిన వాతావరణ కేంద్రం


ఈ ఏడాది ఫిబ్రవరి నుంచే మొదలైన భానుడి ప్రతాపం మున్ముందు మరింత పెరిగే అవకాశం ఉందని విశాఖపట్టణంలోని వాతావరణ కేంద్రం తెలిపింది. ముఖ్యంగా రాయలసీమ, కోస్తా జిల్లాల్లో భానుడు నిప్పులు చెరుగుతాడని తెలిపింది. ఇప్పటికే సాధారణం కన్నా మూడు డిగ్రీల వరకు అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయని, ఇది కొనసాగే అవకాశం ఉందని తెలిపింది. శనివారం రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలకు పైగా నమోదయ్యాయి. కర్నూలులో రూ.41.1, అనంతపురంలో 40.7, జంగమేశ్వరపురంలో 41,  తిరుపతిలో 40.5, నందిగామలో 38.8 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. మున్ముందు ఉష్ణోగ్రతలు మరింత పెరిగే అవకాశం ఉండడంతో ప్రజలు రక్షణ చర్యలు తీసుకోవాలని, అత్యవసరమైతే తప్ప మధ్యాహ్నం సమయంలో బయటకు రావద్దని అధికారులు సూచించారు.

  • Loading...

More Telugu News