: టీజేఏసీ చైర్మన్ కోదండరాం అరెస్ట్.. ఇందిరాపార్క్ వద్ద ఉద్రిక్తత.. భారీగా మోహరించిన పోలీసులు

తెలంగాణ జేఏసీ చైర్మన్ కోదండరాంను పోలీసులు అరెస్ట్ చేశారు. ధర్నాచౌక్ ను తరలించాలన్న ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా వామపక్షాల ఆధ్వర్యంలో ఈ ఉదయం సుందరయ్య విజ్ఞాన కేంద్రం నుంచి ఇందిరాపార్క్ వరకు 2కే రన్ ప్రారంభించారు. ఇందులో పాల్గొన్న టీజేఏసీ చైర్మన్ కోదండరాం సహా పలువురిని పోలీసులు అరెస్ట్ చేశారు. దీంతో ఇందిరాపార్క్ వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఆ ప్రాంతంలో పోలీసులను పెద్ద ఎత్తున మోహరించారు. దీంతో కర్ఫ్యూ వాతావరణం తలపిస్తోంది.