: ఆలయ కొలనులో రద్దయిన నోట్లు.. పడేసిన భక్తుడు
ఆలయ కొలనులో ఓ భక్తుడు పడేసిన రద్దయిన నోట్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. తమిళనాడులోని మధురై జిల్లా తిరువాతవూర్‌లో ఈ ఘటన జరిగింది. శనివారం స్థానిక తిరుమనై నాథర్ ఆలయానికి వచ్చిన బ్యాగుతో వచ్చిన భక్తుడొకరు ఆలయ కొలనులో ఆ బ్యాగును పడేశారు. గమనించిన ఆలయ సిబ్బంది వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. వారొచ్చి కొలనులోని బ్యాగును తీసి తెరిచి చూడగా అందులో రద్దయిన పెద్దనోట్లు కనిపించాయి. వాటి విలువ రూ.2.49 లక్షలని పోలీసులు తెలిపారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు భక్తుడి కోసం గాలిస్తున్నారు.