: యూపీలో 'యాంటీ రోమియో' అత్యుత్సాహం... సస్పెండైన ముగ్గురు పోలీసులు!


బహిరంగ ప్రదేశాల్లో యువతులను వేధిస్తున్న వారికి బుద్ధి చెప్పాలన్న ఉద్దేశంతో తాను సీఎంగా బాధ్యతలు స్వీకరించిన తరువాత యోగి ఆధిత్యనాథ్ ప్రారంభించిన యాంటీ రోమియో స్క్వాడ్ పనులపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఘజియాబాద్ లోని ఓ పార్కులో కూర్చుని ఉన్న జంటను ముగ్గురు పోలీసులు అరెస్ట్ చేసి తీసుకువెళ్లిన ఘటనపై విమర్శలు రాగా, నిబంధనలకు విరుద్ధంగా ప్రవర్తించిన ముగ్గురు పోలీసులను ఉన్నతాధికారులు సస్పెండ్ చేశారు. ఈ జంట తప్పేమీ లేకపోవడం, మహిళా పోలీసులు లేకుండా యువతిని స్టేషన్ కు తీసుకురావడంతో వీరిని సస్పెండ్ చేసినట్టు అధికారులు తెలిపారు. హెడ్ కానిస్టేబుల్ మెహతాబ్, కానిస్టేబుళ్లు దిలీప్ కుమార్, పంకజ్ కుమార్ లను విధుల నుంచి తొలగించామని వెల్లడించారు. కాగా, పోలీసులు జంటను ప్రశ్నించడం, ఆపై వారినీ వ్యాన్ ఎక్కించి స్టేషన్ కు తీసుకువెళ్లడాన్ని, ఆ ప్రాంతంలో ఉన్న పలువురు తమ మొబైల్ ఫోన్లతో వీడియో తీయడంతో, అవి వైరల్ అయ్యాయి.

  • Loading...

More Telugu News