: అమెరికన్ల సంబరాలు... ట్రంప్ అసహనం!


కొత్త హెల్త్‌ కేర్‌ బిల్లుపై ట్రంప్‌ సర్కారు ఓటమి చెందిందన్న వార్త తెలిసి షికాగోలోని ట్రంప్‌ టవర్‌ వద్ద అమెరికన్లు సంబరాలు నిర్వహించుకోగా, తాను తెచ్చిన బిల్లుకు మద్దతు లభించకపోవడంపై సొంత పార్టీ సభ్యులపై ట్రంప్‌ తీవ్ర అసహనాన్ని వ్యక్తం చేశారు. విపక్షంలోని డెమోక్రాట్లు కూడా ఓ మంచి బిల్లును గుర్తించడం లేదని అరోపించిన ఆయన, ఒబామా కేర్‌ కొనసాగనుందని, ఒక్కసారిగా ఇన్సూరెన్స్‌ ప్రీమియం రేట్లు పెరగనున్నాయని అన్నారు. ప్రస్తుతం తాను చేయగలిగిందేమీ లేదని వ్యాఖ్యానించిన ఆయన, దేశానికి చెడు పరిణామాలు సంభవించనున్నాయని హెచ్చరించారు.

గత 18 నెలలుగా ఒబామా కేర్‌ ను తాను వ్యతిరేకిస్తూనే ఉన్నానని గుర్తు చేసిన ఆయన, ఈ పథకం కొనసాగితే పరిస్థితి దిగజారుతుందని అన్నారు. పాలసీ ప్రీమియంలు భారీగా పెరిగి, ప్రజలు ఈ బీమాను ఉపయోగించుకోలేని దుస్థితి రానుందని బిల్లును ప్రతినిధుల సభ నుంచి వెనక్కు తీసుకున్న తరువాత ట్రంప్ మీడియాతో మాట్లాడుతూ అన్నారు. మరోసారి బిల్లును తెస్తామని, అప్పటికి నిజాన్ని తెలుసుకున్న డెమోక్రాట్లు కూడా మద్దతిస్తారని భావిస్తున్నట్టు తెలిపారు. బిల్లు ఆమోదం పొందడానికి తమకు ఇంకా పది, పదిహేను ఓట్లు అవసరం ఉందని చెప్పారు. బిల్లుపై నిజాలను తెలుసుకోలేకనే ఇలా జరిగిందని చెప్పుకొచ్చారు.

  • Loading...

More Telugu News