: అలాంటి వారిని హింసించే వారితో ఊచలు లెక్క పెట్టిస్తాం: యూపీ కొత్త సీఎం
ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన అనంతరం యోగి ఆదిత్యానాథ్ తొలిసారి తన సొంత నియోజకవర్గం గోరఖ్ పూర్ కి వచ్చారు. ఈ సందర్భంగా అక్కడ ఏర్పాటు చేసిన బహిరంగసభలో ఆయన మాట్లాడుతూ... ప్రభుత్వం ఎలా నడవాలో తాను చూపిస్తానని అన్నారు. సామాన్యులకు చేరువగా తమ సర్కారు నడుస్తుందని అన్నారు. తాము అన్ని వర్గాలని సమానంగా చూస్తామని అన్నారు.
‘సబ్కా సాత్, సబ్కా వికాస్’ నినాదం సూత్రాన్ని తాము అనుసరిస్తామని అన్నారు. పోకిరీల ఆగడాలకు అడ్డుకట్ట వేసేందుకు ‘యాంటీ రోమియో’ స్క్వాడ్స్ రెడీగా ఉంటాయని ఆయన అన్నారు. ఆడ, మగవారు కలిసుంటే హింసించే వారితో ఊచలు లెక్క పెట్టిస్తామని ఆయన చెప్పారు. తమ రాష్ట్రంలో శాంతిభద్రతలను సమర్థవంతంగా కాపాడుతామని అన్నారు. తాము ఎన్నికల మెనిఫెస్టోలో చెప్పిన అంశాన్నింటినీ అమలు చేస్తామని చెప్పారు.