: కేజ్రీవాల్‌ను, మ‌మ్మ‌ల్ని చంపేస్తామ‌ని బెదిరించాడు: లాయ‌ర్‌ పై ఆప్ ప్రతినిధి ఫిర్యాదు


ఢిల్లీ ముఖ్యమంత్రి అర‌వింద్ కేజ్రీవాల్ త‌న‌పై చేసిన ఆరోప‌ణ‌ల నేప‌థ్యంలో ఆయ‌న‌తో పాటు మ‌రో న‌లుగురిపై కేంద్ర ఆర్థిక శాఖ‌ మంత్రి అరుణ్‌ జైట్లీ పరువు నష్టం దావా వేయ‌గా, ఈ రోజు ఢిల్లీ ప‌టియాలా హౌస్ కోర్టు వారికి నోటీసులు పంపిన విష‌యం తెలిసిందే. అయితే, ఈ క్ర‌మంలో అదే కోర్టులో ప్రాక్టీస్ లాయ‌ర్‌గా ప‌నిచేస్తోన్న వివేక్.. కేజ్రీవాల్‌తో పాటు త‌మ‌ను చంపేస్తాన‌ని బెదిరించాడ‌ని ఆప్ ప్రతినిధి రాఘవ్ చద్దా వివేక్ మేజిస్ట్రేట్‌కు ఫిర్యాదు చేశారు. కాగా, జైట్లీ వేసిన ప‌రువు న‌ష్టం కేసులో తదుపరి విచారణను కోర్టు మే 20కి వాయిదా వేసింది.

  • Loading...

More Telugu News