: కీలక చర్చలో అల్లుడు లేకపోవడంతో డొనాల్డ్ ట్రంప్ నిరాశ!


అమెరికాలో కొనసాగుతున్న ఒబామా కేర్‌ వైద్య పాలసీ స్థానంలో నూతన పాలసీని ప్రవేశపెట్టేందుకు ఆ దేశ అధ్య‌క్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ప్రయత్నాలు జ‌రుపుతున్న విష‌యం తెలిసిందే. అయితే, ఈ అంశంపై చర్చ జరుగుతున్న సమయంలో త‌న‌ కుమార్తె ఇవాంకా, అల్లుడు జారెద్ కుష్నెర్ అక్క‌డ లేక‌పోవ‌డంతో ట్రంప్ నిరాశ చెందారట‌. వారిద్ద‌రు విహారయాత్రకు వెళ్లడంతో ఈ చ‌ర్చ‌కు హాజ‌రుకాలేక‌పోయార‌ని ట్రంప్‌కు సన్నిహితంగా ఉండే ఓ వ్యక్తి తెలిపారు. ఆ బిల్లు ఆమోదానికి తగినంత మంది సభ్యుల మద్దతు కూడగట్టడంలో డొనాల్డ్‌ ట్రంప్ సర్కారు విఫలమైంది. కీలక సమయంలో అండగా ఉండాల్సిన అల్లుడు త‌న వ‌ద్ద లేక‌పోవ‌డం ట్రంప్‌కు నచ్చలేదట.

  • Loading...

More Telugu News