: అధికార లాంఛనాలతో సరబ్ జిత్ అంత్యక్రియలు
పాకిస్తాన్ లో అత్యంత విషాదకర పరిస్థితుల నడుమ తనువు చాలించిన భారతీయ ఖైదీ సరబ్ జిత్ అంత్యక్రియలను అధికార లాంఛనాలతో నిర్వహించనున్నారు. ఈమేరకు కేంద్ర హోం మంత్రి సుశీల్ కుమార్ షిండే హామీ ఇచ్చారని సరబ్ జిత్ సోదరి దల్బీర్ చెప్పారు. సరబ్ జిత్ అంత్యక్రియలను స్వగ్రామం భీకీవింద్ లో నిర్వహిస్తామని దల్బీర్ వెల్లడించారు. కాగా, సరబ్ జిత్ మరణంతో విషాదంలో మునిగిపోయిన అతని కుటుంబ సభ్యులను షిండే ఈ ఉదయం పరామర్శించారు.