: ఢిల్లీ మున్సిపల్‌ కార్పొరేషన్‌ ఎన్నికల్లో మేము గెలిస్తే ఇంటిపన్ను రద్దు: కేజ్రీవాల్‌ హామీ


ఢిల్లీ మున్సిపల్‌ కార్పొరేషన్‌ ఎన్నికల ప్రచారంలో ఆమ్ ఆద్మీపార్టీ నేత‌, ఆ రాష్ట్ర సీఎం ఆర‌వింద్ కేజ్రీవాల్ దూసుకుపోతూ ప‌లు హామీలు గుప్పిస్తున్నారు. తాము ఆ ఎన్నిక‌ల్లో గెలుపొందితే ఢిల్లీలో నివాస గృహాలపై ఇంటి పన్ను రద్దు చేస్తామని ప్ర‌క‌టించారు. ఆ పన్ను వల్ల అవినీతి బాగా జ‌రిగిపోతోందని కూడా ఆయ‌న అన్నారు. ఢిల్లీ మున్సిపల్‌ కార్పొరేషన్‌లో ప్ర‌స్తుతం బీజేపీ అధికారంలో ఉన్న నేప‌థ్యంలో కేజ్రీవాల్ ప‌లు వ్యాఖ్య‌లు చేశారు. కౌన్సిలర్లు ఎన్నికలకు ముందు స్కూటర్లపై తిరగడం చూశానని, ప్ర‌స్తుతం వారంతా ఖరీదైన కార్లలో తిరుగుతున్నారని వ్యాఖ్యానించారు. మున్సిపల్‌ ఉద్యోగులకు సకాలంలో జీతాలు అందేలా చేస్తానని, త్వ‌ర‌లోనే త‌మ పూర్తి మేనిఫెస్టో విడుదల చేస్తాన‌ని చెప్పారు.

అయితే, కేజ్రీవాల్ ఇచ్చిన‌ ఈ హామీల‌పై భార‌తీయ జ‌న‌తా పార్టీ నేత‌లు మండిప‌డుతున్నారు. కేజ్రీవాల్ చేసిన వ్యాఖ్య‌లు సిగ్గుచేట‌ని బీజేపీ ఢిల్లీ యూనిట్‌ చీఫ్‌ మనోజ్‌ తివారి అన్నారు. ఆమ్ ఆద్మీ స‌ర్కారు ఇంటి పన్నును కచ్చితంగా వసూలు చేయాలని గ‌తంలో అంద‌ని అన్నారు. ముఖ్యంగా అనధికారిక కాలనీల నుంచి పన్ను సేకరించాలని స్థానిక సంస్థలకు లేఖలు కూడా రాసిందని పేర్కొన్నారు. ఇప్పుడు ఎన్నిక‌ల దృష్ట్యా ఇటువంటి వ్యాఖ్య‌లు చేస్తున్నార‌ని అన్నారు.

  • Loading...

More Telugu News