: షేన్ వార్న్ సాధించిన దానిలో సగం సాధించినా చాలు: కుల్ దీప్ యాదవ్
తన ఆదర్శ బౌలర్ ఆస్ట్రేలియా మాజీ దిగ్గజ ఆటగాడు షేన్ వార్న్ అని నాలుగో టెస్టులో తొలిరోజు అద్భుతంగా రాణించి ఆసీస్ వెన్ను విరిచిన వర్థమాన బౌలర్ కుల్ దీప్ యాదవ్ తెలిపాడు. ధర్మశాలలో తొలిరోజు ఆట ముగిసిన అనంతరం మాట్లాడుతూ, ప్రణాళిక ప్రకారం బంతులు వేశానని చెప్పాడు. సీనియర్ల సలహాలు తీసుకుని బౌలింగ్ చేశానని చెప్పాడు. తన కెరీర్ లో షేన్ వార్న్ సాధించిన ఘనతలో సగం ఘనత సాధించినా చాలని అన్నాడు. ఐపీఎల్ లో ముంబై ఇండియన్స్ జట్టుకు ఆడుతున్న సమయంలో ప్రాక్టీస్ సెషన్ లో సచిన్ ను అవుట్ చేసిన సందర్భం తన జీవితంలో మర్చిపోలేనిదని కుల్ దీప్ యాదవ్ చెప్పాడు. అలా అవుట్ చేయగానే సచిన్ తనను అభినందించారని, అది మర్చిపోలేనని అన్నాడు. కాగా, ఈ తొలిరోజు మ్యాచ్ లో నాలుగు వికెట్లు తీసిన సంగతి తెలిసిందే.