: మొబైల్ కనెక్షన్లకు ఆధార్ తప్పనిసరి చేస్తూ ఆదేశాలు!


ప్రభుత్వం ప్రవేశపెడుతున్న పథకాల్లో అక్రమాలను తొలగించే క్రమంలో కేంద్ర సర్కారు అన్నింటికీ ఆధార్ నెంబ‌రు అనుసంధానం త‌ప్ప‌నిస‌రి చేస్తోన్న విష‌యం తెలిసిందే. ఇక‌పై మొబైల్ క‌నెక్ష‌న్‌కు కూడా ఆధార్ త‌ప్ప‌ని స‌రి చేయాల‌ని ఆదేశాలు జారీ చేసింది. ఇక‌పై మొబైల్ ఫోన్ కనెక్షన్లకు ఆధార్ ఆధారిత ఈ-కేవైసీననే పాటించాలని ప్ర‌క‌టించింది. ఈ నేప‌థ్యంలో టెలికం డిపార్ట్‌మెంట్(డీవోటీ) స్పందిస్తూ... ప్రీపెయిడ్, పోస్ట్‌పెయిడ్ సబ్‌స్కైబర్లకు ఇచ్చిన అన్ని లైసెన్స్‌లను ఈ-కేవైసీ ద్వారా మరో మారు ధ్రువీకరించుకోవాలంటూ టెలికం కంపెనీలకు సూచించింది. ఈ మొత్తం ప్ర‌క్రియ‌ను ఫిబ్రవరి 6, 2018 నాటికి పూర్తిచేయాలని, అనంత‌రం ఆధార్‌తో అనుసంధానం కాని మొబైల్ నంబర్‌ను అక్రమమైనవిగా గుర్తిస్తామని తెలిపింది. కేంద్ర ప్రభుత్వం ఆదేశాల మేర‌కు కొత్త కనెక్షన్ తీసుకునేవారు ఇకపై ఆధార్ ఆధారంగానే తీసుకోవాలి.

  • Loading...

More Telugu News