: జగన్‌పై నేను మాట్లాడితే వాస్తవాలు చెప్పాల్సి వస్తుంది: మంత్రి పరిటాల సునీత
ఆంధ్రప్రదేశ్ శాసనసభలో ప్రతిపక్ష వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అగ్రిగోల్డ్ అంశంపై రాష్ట్ర ప్రభుత్వంపై తీవ్ర ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. అయితే, ఈ రోజు మంత్రి పరిటాల సునీత మీడియాతో మాట్లాడుతూ... జగన్‌పై తాను మాట్లాడితే వాస్తవాలు చెప్పాల్సి వస్తుందని వ్యాఖ్యానించారు. అగ్రిగోల్డ్ అంశంపై పరిటాల సునీతను మీడియా ప్రశ్నించగా, ఒకవేళ తాను జగన్మోహన్‌రెడ్డిపై మాట్లాడితే ఆయన 16 నెలలు కాదు.. 16 ఏళ్లు జైలుకు వెళ్లాల్సి వస్తుందని అన్నారు.