: తమిళ సంఘాల ఆగ్రహంతో వెనక్కి తగ్గిన రజనీకాంత్
శ్రీలంక పర్యటనను తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ రద్దు చేసుకున్నారు. శ్రీలంకలోని జాఫ్నా ప్రాంతంలో తమిళుల కోసం జ్ఞానం ఫౌండేషన్ నిర్మించిన 150 ఇళ్లను పంపిణీ చేయడానికి ఏప్రిల్ 9న రజనీ అక్కడకు వెళ్లాల్సి ఉంది. ఈ నేపథ్యంలో, ఆయన పర్యటన వివాదాస్పదమైంది. ఎల్టీటీఈని శ్రీలంక ప్రభుత్వం ఊచకోత కోస్తున్నప్పుడు ఏ మాత్రం పట్టించుకోని రజనీకాంత్... ఇప్పడు శ్రీలంకకు ఎందుకు వస్తున్నారంటూ అక్కడున్న తమిళులు మండిపడుతున్నారు. ఆయన పర్యటనను తాము అడ్డుకుంటామని హెచ్చరించారు. రజనీ పర్యటనను అక్కడున్న కొన్ని తమిళ సంఘాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. తన పర్యటన రోజురోజుకూ వివాదాస్పదంగా మారడంతో, చివరకు శ్రీలంకలో పర్యటించకూడదని రజనీ నిర్ణయించుకున్నారు.