: బుల్లి రాకుమారుడి స్కూల్ లో 'బెస్ట్ ఫ్రెండ్స్'కు చోటులేదు!


బ్రిటన్ బుల్లి రాకుమారుడు ప్రిన్స్ జార్జ్ చదవనున్న స్కూల్ లో బెస్ట్ ఫ్రెండ్స్ కు చోటులేదు. బ్రిటన్ రాజవంశం నివాసముండే కెన్సింగ్టన్ ప్యాలెస్ కు సమీపంలో ఉన్న ప్రైవేట్ స్కూల్ థామస్ బ్యాటర్ సీ ప్లే స్కూల్ కు ప్రిన్స్ జార్జ్ ను రాజకుటుంబం పంపించనుంది. సెప్టెంబర్ నుంచి ప్రిన్స్ జార్జ్ ఈ స్కూల్ కు వెళ్లనున్నాడని రాజప్రాసాదం గతంలో ప్రకటించింది. 40 ఏళ్ల సుదీర్ఘ ప్రస్థానం కలిగిన ఈ స్కూల్ లో 540 మంది పిల్లలు విద్యనభ్యసిస్తున్నారు. ప్రధానంగా పిల్లల సత్ప్రవర్తన మీద దృష్టి పెట్టే ఈ స్కూల్ లో బెస్ట్ ఫ్రెండ్స్ ను తీవ్ర నిరాశకు గురిచేస్తారు.

బెస్ట్ ప్రెండ్స్ ను ఏర్పాటు చేసుకునేందుకు అస్సలు అనుమతించరు. బెస్ట్ ఫ్రెండ్స్ ను ఎవరైనా చేసుకుంటే విడిపోయే సమయంలో ఆ చిన్న హృదయాలు తట్టుకోలేవని, అలా ఏర్పడే వెలితి పిల్లల ప్రవర్తనపై ప్రభావం చూపుతుందని స్కూలు యాజమాన్యం విశ్వసిస్తుంది. అందుకే అక్కడ బెస్ట్ ఫ్రెండ్స్ ను ఏర్పాటు చేసుకునేందుకు అనుమతించరు. ఏ పనైనా సొంతంగా చేసుకోవడం, మంచి బుద్ధులు నేర్చుకోవడం, ఇతరులను గౌరవించడం వంటివి కూడా నేర్పుతారు. 

  • Loading...

More Telugu News