: మనసులు కలిశాయనుకున్నా.. కానీ, అది భ్రమ అని తేలిపోయింది: హీరోయిన్ హన్సిక


టాలీవుడ్, కోలీవుడ్ లలో వరుస సినిమాలు చేస్తూ, సక్సెస్ ఫుల్ గా ముందుకు సాగుతోంది హన్సిక. తమిళ యంగ్ హీరో శింబుతో హన్సిక ప్రేమాయణం నడిపిన సంగతి తెలిసిందే. ఓ ఇంటర్వ్యూలో ఈ ప్రేమాయణంపై స్పందించిన హన్సిక పలు విషయాలను వెల్లడించింది. ఆ ప్రేమ గురించి ఎంత తక్కువగా మాట్లాడుకుంటే అంత మంచిదని ఆమె తెలిపింది. అసలు తాము గొడవ కూడా పడలేదని చెప్పింది. అతను ఒక మాట అన్నాడని... దాంతో, తన మనసు విరిగిపోయిందని చెప్పింది. ప్రతిగా తాను కూడా ఒకే ఒక మాట అనేసి, శింబు నుంచి దూరంగా జరిగిపోయానని తెలిపింది.

తామిద్దరూ విడిపోయిన తర్వాత కూడా కలసి సినిమా చేశామని... వ్యక్తిగతంగా, వృత్తి పరంగా శింబుతో తనకు ఎలాంటి ఇబ్బంది  లేదని హన్సిక తెలిపింది. ఇద్దరి మనసులు కలిశాయని తాను భావించానని... అయితే, అదంతా భ్రమే అనే విషయం తేలిపోయిందని, దాంతో తాను పక్కకు జరిగిపోయానని చెప్పింది. వాస్తవానికి అది జరిగిన సమయంలో తనకు అంత మెచ్యూరిటీ కూడా లేదని తెలిపింది.

  • Loading...

More Telugu News