: తీవ్ర భావోద్వేగాలకు లోనైన కుల్ దీప్ యాదవ్


హిమాచల్ ప్రదేశ్ లోని ధర్మశాలలో జరుగుతున్న నాలుగో టెస్టులో అరంగేట్రం చేసిన కుల్ దీప్ యాదవ్ తీవ్ర భావోద్వేగానికి లోనయ్యాడు. అరంగేట్ర మ్యాచ్ లో క్రీజు లో కుదురుకున్న డేవిడ్ వార్నర్ (56) ను అద్భుతమైన బంతితో పెవిలియన్ కు పంపిన అనంతరం అంతర్జాతీయ క్రికెట్ లో తొలి వికెట్ తీసిన ఆనందంలో కెప్టెన్ అజింక్యా రహానేను గట్టిగా ఆలింగనం చేసుకుని ఉండిపోయాడు. సహచరులంతా కితాబులిస్తున్నా రహానేను వదలకుండా అలాగే ఉండిపోయాడు. అనంతరం హ్యాండ్స్ కోంబ్ (8) ను మరో షాకింగ్ బంతికి పెవిలియన్ కు పంపి ఆనందంతో పొంగిపోయాడు. మూడో వికెట్ గా గ్లెన్ మ్యాక్స్ వెల్ ను మరో అద్భుత బంతితో పెవిలిన్ కు పంపిన కుల్ దీప్ యాదవ్.. కేఎల్ రాహుల్ అభినందిస్తున్న ఆనందంతో పరుగుతీశాడు. ప్రస్తుత జట్టులో పొడగరి అయిన ఉమేష్ యాదవ్ మీదకి జంప్ చేసి గట్టిగా ఆలింగనం చేసుకుని సంతోషాన్ని వ్యక్తం చేశాడు. జట్టంతా అతనిని అభినందించింది. 

  • Loading...

More Telugu News