: టెస్ట్ కెప్టెన్ గా ముంబై దిగ్గజాల సరసన నిలిచిన రహానే!
భారత టెస్టు కెప్టెన్లుగా వ్యవహరించిన ముంబై క్రికెట్ దిగ్గజాలు పాలీ ఉమ్రిగర్, నారీ కాంట్రాక్టర్, జీఎస్ రామ్ చంద్, అజిత్ వాడేకర్, సునీల్ గవాస్కర్, దిలీప్ వెంగ్ సర్కార్, రవిశాస్త్రి, సచిన్ టెండూల్కర్ ల సరసన అజింక్య రహానే చేరాడు. భారత జట్టు టెస్టు బాధ్యతలను చేపట్టిన 33వ ఆటగాడిగా ఈ రోజు రహానే అవతరించాడు. గాయం కారణంగా కోహ్లీ ఈ టెస్టుకు దూరమవడంతో రహానే కెప్టెన్ గా బాధ్యతలను నిర్వహిస్తున్నాడు. ఈ నేపథ్యంలో ముంబై నుంచి టీమిండియా కెప్టెన్ గా వ్యవహరించిన వారి జాబితాలో రహానే కూడా చేరాడు.