: అమరావతిపై ప్రజెంటేషన్ కు జగన్ గైర్హాజరు.. హాజరు కాకపోవడమే మేలన్న జగన్


అసెంబ్లీ కమిటీ హాల్ లో అమరావతి నగర నిర్మాణ ప్రణాళికపై నార్మన్ ఫోస్టర్ అండ్ పార్ట్ నర్స్ ప్లాన్ పై అధికారులు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చారు. ఈ ప్రజెంటేషన్ కు హాజరు కావాలంటూ ప్రతిపక్ష నేత జగన్ ను మంత్రి నారాయణ స్వయంగా ఆహ్వానించారు. అయితే, ఈ ప్రజెంటేషన్ కు జగన్ హాజరు కాలేదు. ఈ సందర్భంగా జగన్ మాట్లాడుతూ, మూడేళ్ల నుంచి ఒక్క ఇటుక కూడా పెట్టలేదని... ప్రజలను మోసం చేయడానికే ప్రజెంటేషన్ ఇస్తున్నారని చెప్పారు. ఈ ప్రజెంటేషన్ కు హాజరుకాకపోవడమే మేలని అన్నారు. ఈ ప్రజెంటేషన్ వల్ల సభా సమయం మరో గంట వేస్ట్ కావడం మినహా మరొకటి కాదని తెలిపారు.

  • Loading...

More Telugu News