: కడప ఎమ్మెల్సీ ఎన్నికల్లో రూ. 100 కోట్ల బెట్టింగ్.. కోటిన్నర గెలుచుకున్న టీడీపీ నేత: ఆదినారాయణ రెడ్డి


స్థానిక సంస్థల కోటాలో జరిగిన కడప ఎమెల్సీ ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థి వైయస్ వివేకానంద రెడ్డిపై టీడీపీ అభ్యర్థి బీటెక్ రవి విజయం సాధించిన సంగతి తెలిసిందే. అయితే, ఈ ఎన్నికలకు సంబంధించి భారీ ఎత్తున బెట్టింగ్ లు నడిచాయని టీడీపీ ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి తెలిపారు. ఈ రోజు అసెంబ్లీ లాబీలో ఆయన మాట్లాడుతూ, జిల్లాలో రూ. 100 కోట్ల బెట్టింగ్ లు జరిగాయని చెప్పారు. తమ సొంత ఊరు దేవనగుడిలోనే కోటిన్నర వరకు పందేలు కాశారని తెలిపారు. బెట్టింగ్ లో ఓ టీడీపీ నేత కోటిన్నర గెలుచుకున్నారని చెప్పారు. 

  • Loading...

More Telugu News