: స్మిత్, వార్నర్ అర్ధసెంచరీలు... చెమటోడుస్తున్న టీమిండియా బౌలర్లు


ధర్మశాల వేదికగా జరుగుతున్న చివరి టెస్టులో టాస్ గెలిచిన ఆస్ట్రేలియా బ్యాటింగ్ ప్రారంభించింది. ఓపెనర్ రెన్ షాను ఉమేష్ యాదవ్ ఆరంభంలోనే అవుట్ చేసి టీమిండియాకు శుభారంభం ఇచ్చాడు. అయితే దీనిని సద్వినియోగం చేసుకోవడంలో టీమిండియా బౌలర్లు విఫలమయ్యారు. కుల్ దీప్ యాదవ్ ఈ టెస్టుతో అంతర్జాతీయ క్రికెట్ లో అరంగేట్రం చేశాడు. భువనేశ్వర్ కుమార్ బౌలింగ్ లో వచ్చిన సునాయాసమైన క్యాచ్ ను ఫీల్డర్ చేజార్చడంతో వార్నర్ (52) అర్ధ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. అంతకు ముందే ధాటిగా ఆడిన కెప్టెన్ స్టీవ్ స్మిత్ (72) అర్ధ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. దీంతో ఆసీస్ ఆటగాళ్లు క్రీజులో కుదురుకుంటున్నారు. వారిని అవుట్ చేసేందుకు టీమిండియా బౌలర్లు చెమటోడుస్తున్నారు. దీంతో తొలి రోజు తొలి సెషన్ 31 ఓవర్లు పూర్తయ్యేసరికి రెన్ షా(1) వికెట్ కోల్పోయిన ఆసీస్...131 పరుగులు చేసింది. టీమిండియా బౌలర్లలో ఉమేష్ యాదవ్ ఒక వికెట్ తీశాడు. 

  • Loading...

More Telugu News