: విశాలమైన భవంతిని తనకు తాను కానుకగా ఇచ్చుకున్న హీరోయిన్!
బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కంగనా రనౌత్ తనకు తాను బర్త్ డే కానుకను ఇచ్చుకుంది. నేడు పుట్టిన రోజు జరుపుకుంటున్న కంగనా రనౌత్ ముంబైలోని విలాసవంతమైన ప్రాంతంలో విశాలమైన భవంతని పుట్టినరోజు కానుకగా తనకు తాను అందజేసుకుంది. తనకో విశాలమైన భవనం, కార్యాలయం ఉండాలని ఇన్నాళ్లు కలలు గన్న కంగనా, ఈ బంగ్లాతో చిరకాల వాంఛ నెరవేర్చుకుంది. ఈ భవంతిలో విశాలమైన కార్యాలయం ఏర్పాటు చేసుకోవాలని కంగనా భావిస్తోంది.
ఇక్కడ్నుంచే ప్రొడక్షన్ హౌస్ తో పాటు, దర్శకత్వం నిర్వహించాలని కూడా కంగనా భావిస్తోందని ఆమె సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి. 'రంగూన్' సినిమాతో ఈ మధ్యే ప్రేక్షకుల ముందుకు వచ్చిన కంగనా, హన్సల్ మహతా దర్శకత్వంలో విడుదలకు సిద్ధంగా ఉన్న 'సిమ్రన్'లో నటిస్తోంది. దానితో పాటు 'గౌతమీపుత్ర శాతకర్ణి' సినిమాతో విజయం అందుకున్న క్రిష్ దర్శకత్వంలో ఝూన్సీ లక్ష్మీబాయి జీవిత చరిత్రగా రూపొందనున్న 'మణికర్ణిక' సినిమాలో కూడా నటించనున్న సంగతి తెలిసిందే.