: టీడీపీ నేతలకు నోటీసులు జారీ చేసిన శిల్పా చక్రపాణి రెడ్డి


ముగ్గురు టీడీపీ నేతలకు ఎమ్మెల్సీ శిల్పా చక్రపాణి రెడ్డి సంజాయిషీ నోటీసులు జారీ చేశారు. ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడ్డారనే ఆరోపణలతో ఈ నోటీసులు జారీ చేశారు. వీరిలో కొత్తపల్లి మండలం జడ్పీటీసీ పురుషోత్తం రెడ్డి, పాములపాడు జడ్పీటీసీ దుశ్యంత్ రెడ్డి, శాలివాహన ఫెడరేషన్ ఛైర్మన్ తుగ్గలి నాగేంద్రలు ఉన్నారు. వారం రోజుల్లోగా ఈ నోటీసులకు వివరణ ఇవ్వాలని ఆదేశించారు. వీరి వివరణను పార్టీ అధిష్ఠానానికి కూడా పంపుతామని చెప్పారు. ఎన్నికల సందర్భంగా పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడినట్టు వీరిపై ఫిర్యాదులు అందిన నేపథ్యంలో, ఈ నోటీసులు జారీ చేశారు. 

  • Loading...

More Telugu News