: అమెరికా వీసాలు మరింత కఠినతరం.. టూరిస్ట్ వీసాలు పొందడం కూడా కష్టమే!
అమెరికాకు వెళ్లాలనుకునే వారికి చేదు వార్త. అమెరికా వీసా ప్రాసెస్ మరింత కఠినతరం కాబోతోంది. ఇప్పటికే చాలా కఠినంగా ఉండే యూఎస్ వీసా ప్రాసెస్... మరింత క్లిష్టంగా మారబోతోంది. ఈ క్రమంలో, వీసా జారీ విధానంలో రెండు ప్రక్రియలు ఉండబోతున్నాయి. ఒకటి ప్రత్యేక పరిశీలన ద్వారా అవసరమైన వారిని గుర్తించడం. రెండోది వీసాలను మరింత కఠినం చేయడం.
ఈ నేపథ్యంలో, అమెరికాకు పర్యాటక వీసా, వ్యాపార వీసాలపై వెళ్లడం కూడా కష్టతరం కానుంది. గత 15 ఏళ్లుగా ఎక్కడ నివాసం ఉన్నారు? ఏయే సంస్థల్లో ఉద్యోగం చేశారు? గత ఐదు ఏళ్లుగా వాడిన ఫోన్ నంబర్లు ఏమిటి?... తదితర వివరాలు సమర్పించాల్సి ఉంటుంది. ఇప్పటికే యూఎస్ విదేశాంగ శాఖ నుంచి అన్ని దేశాల్లోని అమెరికా వీసా కార్యాలయాలకు దీనికి సంబంధించిన ఆదేశాలు ఫ్యాక్స్ ద్వారా అందాయట.