: కర్నూలు జిల్లాలో దారుణం... నిద్రిస్తున్న వివాహిత నోట్లో గుడ్డలు కుక్కి, కాళ్లు చేతులు కట్టేసి గ్యాంగ్ రేప్!


నిద్రిస్తున్న ఓ వివాహితపై దుండగులు గ్యాంగ్ రేప్ కు పాల్పడ్డారు. నిద్రిస్తున్న ఆమె నోట్లో గుడ్డలు కుక్కి, కాళ్లు చేతులు కట్టేసి మానభంగం చేశారు. ఢిల్లీలో నిర్భయ తరహాలో జరిగిన ఈ దాడితో, బాధితురాలు అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయింది. ఈ దారుణ ఘటన కర్నూలు జిల్లా ఆలహర్విలో జరిగింది. లైంగిక దాడి తర్వాత ఆమెను అక్కడే పడేసి, దుండగులు పారిపోయారు. ఈ నేపథ్యంలో, ఇంటి ముందు అపస్మారక స్థితిలో పడి ఉన్న బాధితురాలిని ఆమె కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తరలించి, చికిత్స చేయిస్తున్నారు. అప్పుల వ్యవహారమే ఈ ఘటనకు కారణమని కొందరు చెబుతున్నారు.

  • Loading...

More Telugu News