: వందలాది మంది భారతీయులపై ట్రంప్ సర్కారు వేటు!
అమెరికాలో నివసిస్తున్న వందలాది మంది భారతీయులపై వేటు వేసేందుకు ట్రంప్ సర్కారు సిద్ధమైంది. వీరిపై దేశ బహిష్కరణ వేటు వేసేందుకు సర్వం సిద్ధం చేసింది. మొత్తం 271 మంది భారతీయులపై వేటు వేయనున్నట్టు ట్రంప్ కార్యాలయం వెల్లడించినట్టు భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ఈ విషయాన్ని విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ పార్లమెంటులో ప్రశ్నోత్తరాల సమయంలో తెలిపారు. అయితే, వేటు వేయనున్న వారి జాబితాను బహిష్కరణకు ముందే తమకు అందజేయాలని అమెరికాను కోరినట్టు ఆమె తెలిపారు. వేటుకు గురి కాబోతున్న వారి జాతీయతను తాము పరిశీలించకముందే, వారందరూ అమెరికాలో అక్రమంగా ఉన్నారనే విషయాన్ని తాము ఎలా విశ్వసించగలమని తాము ప్రశ్నించినట్టు సుష్మ తెలిపారు. ఈ వ్యవహారానికి సంబంధించి పూర్తి సమాచారాన్ని అందించాలని కోరామని చెప్పారు.