: టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఆస్ట్రేలియా.. ఆసీస్ కు ఆదిలోనే షాక్ ఇచ్చిన ఉమేష్ యాదవ్


ధర్మశాలలో ఇండియాతో జరుగుతున్న టెస్టులో ఆస్ట్రేలియా టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. అయితే, ఆసీస్ జట్టుకు ఆదిలోనే టీమిండియా పేసర్ ఉమేష్ యాదవ్ షాక్ ఇచ్చాడు. తొలి ఓవర్ ను భువనేశ్వర్ కుమార్ వేశాడు. ఈ ఓవర్ తొలి బంతికే వార్నర్ కు లైఫ్ లభించింది. బ్యాట్ అంచుకు తాకుతూ వెళ్లిన క్యాచ్ ను థర్డ్ స్లిప్ లో ఉన్న నాయర్ అందుకునే ప్రయత్నం చేశాడు. అయితే, బంతికి అతని బొటనవేలు మాత్రమే తాకింది. బంతి బౌండరీకి తరలి పోయింది. చివరి బంతిని కూడా వార్నర్ బౌండరీకి తరలించాడు. అనంతరం రెండో ఓవర్ వేసిన ఉమేష్ యాదవ్... నాలుగో బంతికి ఓపెనర్ రెన్షా (1)ను క్లీన్ బౌల్డ్ చేశాడు. దీంతో, క్రీజులోకి కెప్టెన్ స్మిత్ వచ్చాడు. ఓపెనర్ వార్నర్ 10 పరుగులతో (2 ఫోర్లు) ఆడుతున్నాడు. ప్రస్తుతం ఆస్ట్రేలియా స్కోరు వికెట్ నష్టానికి 11 పరుగులు.

  • Loading...

More Telugu News