: ధర్మశాల టెస్టుకు కోహ్లీ దూరం.. టెస్టు ఆరంభానికి ముందే ఎదురు దెబ్బ


సిరీస్ ఫలితాన్ని శాసించనున్న ధర్మశాల టెస్టుకు ముందే టీమిండియాకు ఎదురుదెబ్బ తగిలింది. కెప్టెన్ కోహ్లీ కీలకమైన ఈ టెస్టుకు దూరమయ్యాడు. మూడో టెస్టు సందర్భంగా ఫీల్డింగ్ చేస్తున్న సమయంలో, ఓ బౌండరీని ఆపబోయిన కోహ్లీ గాయపడ్డ సంగతి తెలిసిందే. అతని భుజానికి గాయమైంది. ఈ నేపథ్యంలో, ఆస్ట్రేలియాతో జరుగుతున్న నాలుగో టెస్టుకు కోహ్లీ దూరమయ్యాడు. అతని స్థానంలో రహానే కెప్టెన్ గా బాధ్యతలను నిర్వహించనున్నాడు. కోహ్లీ స్థానంలో కుల్ దీప్ యాదవ్ తుది జట్టులోకి వచ్చాడు.

మరోవైపు, పేసర్ ఇశాంత్ శర్మ స్థానంలో భువనేశ్వర్ కుమార్ కు స్థానం దక్కింది. ఈ మ్యాచ్ లో ఆడతాడనుకున్న మహ్మద్ షమీకి చోటు దక్కలేదు. మరోవైపు, ఆస్ట్రేలియా జట్టు మాత్రం ఏ మార్పులు లేకుండా బరిలోకి దిగుతోంది. ధర్మశాల పిచ్ పేసర్లకు అనుకూలిస్తుందని భావిస్తున్నారు. 

  • Loading...

More Telugu News