: గైక్వాడ్‌ను ఏం చేయాలి?.. ఎటూ తేల్చుకోలేకపోతున్న శివసేన చీఫ్
ఎయిర్ ఇండియా ఉద్యోగిపై దాడి చేసిన శివసేన ఎంపీ రవీందర్ గైక్వాడ్ విషయంలో ఎటువంటి నిర్ణయం తీసుకోవాలో తెలియక ఆ పార్టీ చీఫ్ ఉద్ధవ్ ఠాక్రే డైలమాలో పడిపోయారు. ఎయిర్ ఇండియా ఉద్యోగిని 25 సార్లు చెప్పుతో కొట్టానని స్వయంగా పేర్కొన్న గైక్వాడ్‌పై చర్యలు తీసుకుంటే శివసైనికులు జీర్ణించుకోలేరు. గైక్వాడ్‌ను పార్టీ నుంచి సస్పెండ్ చేసినా, ఎంపీ పదవికి రాజీనామా చేయమని కోరినా శివసైనికులు తట్టుకోలేరని సీనియర్ నేత ఒకరు తెలిపారు. ఒకవేళ ఆయనపై చర్యలు తీసుకోకుండా వదిలేస్తే దేశానికి తప్పుడు సంకేతాలు వెళ్లే అవకాశం ఉందని ఆయన పేర్కొన్నారు. దీంతో ఎటువంటి నిర్ణయం తీసుకోవాలో తెలియని సందిగ్ధావస్థలో ఠాక్రే పడిపోయారని తెలిపారు.