: ఈపీఎఫ్ వేత‌న ప‌రిమితి రూ.21 వేల‌కు పెంపు.. కేంద్రం యోచ‌న‌


ప్ర‌స్తుతం రూ.15వేలు ఉన్న ఉద్యోగుల భ‌విష్య నిధి (ఈపీఎఫ్‌) పరిమితిని రూ.21 వేల‌కు పెంచాల‌ని కేంద్రం యోచిస్తున్న‌ట్టు తెలుస్తోంది. గతంలో ఉద్యోగుల క‌నీస వేత‌నాల‌ను కేంద్రం రూ.18 వేల‌కు పెంచింది. అప్ప‌టి నుంచి పీఎఫ్ వేత‌న ప‌రిమితిని కూడా పెంచాల‌ని  ఉద్యోగ సంఘాలు డిమాండ్ చేస్తూ వ‌స్తున్నాయి. ఇటీవ‌ల ఈఎస్ఐ వేత‌న ప‌రిమితిని కేంద్ర కార్మిక‌శాఖ రూ.21 వేలుగా నిర్ణ‌యించింది. దీంతో పీఎఫ్ వేత‌న ప‌రిమితిని కూడా రూ.21 వేల‌కు పెంచాల‌ని భావిస్తున్న‌ట్టు స‌మాచారం.

ఉద్యోగుల భ‌విష్య నిధిలో ప్ర‌స్తుతం 3.7 కోట్ల మంది ఉన్నారు. కాగా ప్ర‌స్తుతం  పీఎఫ్ వేత‌న  ప‌రిమితి రూ.15 వేలుగా ఉంది. ఉద్యోగి మూల‌వేత‌నం, డీఏ క‌లిపి ఈలోపు ఉంటే పీఎఫ్‌కు అర్హ‌త ల‌భిస్తుంది. ఇందులో భాగంగా యాజ‌మాన్యం 12 శాతం, ఉద్యోగి వేత‌నం నుంచి 12 శాతం భ‌విష్య నిధిలో నెల‌నెలా జ‌మ‌చేయాల్సి ఉంటుంది. ఈపీఎఫ్ ప‌రిమితిని రూ.21 వేల‌కు పెంచుతున్నట్టు కేంద్ర‌మంత్రి బండారు ద‌త్తాత్రేయ ధ్రువీకరించారు. త్వ‌ర‌లో జ‌ర‌గ‌నున్న సెంట్ర‌ల్ బోర్డ్‌ ఆఫ్‌ ట్రస్టీల భేటీలో ఈ విష‌యాన్ని చ‌ర్చించి తుది నిర్ణ‌యం తీసుకుంటామ‌ని పేర్కొన్నారు.

  • Loading...

More Telugu News