: టీమిండియాకు రహానే అద్భుతమైన కెప్టెన్: స్టీవ్ స్మిత్ కితాబు


టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ భుజం గాయం నుంచి ఇంకా పూర్తిగా కోలుకోనట్టు కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో కోహ్లీ గైర్హాజరీలో టీమిండియా ప్రదర్శన ఎలా ఉంటుందని భావిస్తున్నారంటూ ఆస్ట్రేలియా కెప్టెన్ స్టీవ్ స్మిత్ ను మీడియా ప్రశ్నించగా... స్మిత్ ఆసక్తికర సమాధానం చెప్పాడు. ఒకవేళ కోహ్లీ ఆడని పక్షంలో నిర్ణయాత్మక నాలుగో టెస్టులో టీమిండియాను అజింక్య రహానె అద్భుతంగా నడిపించగలడని కితాబునిచ్చాడు. ప్రస్తుత భారత వైస్‌ కెప్టెన్‌ రహానె ‘మృదు స్వభావి’ అన్నాడు. కోహ్లీ లేకపోయినా వారికి పెద్దగా ఇబ్బందేమీ ఉండదన్నాడు. టీమిండియా బాగా ఆడుతుందని చెప్పిన స్మిత్, అజింక్య జట్టును అద్భుతంగా నడిపించగలడని, కోహ్లీ లేనప్పుడు రాంచీలో అతడు జట్టును ధైర్యంగా ముందుకు నడిపించాడని గుర్తుచేశాడు.

మరోసారి అలాంటి ప్రదర్శనే అతని నుంచి ఉంటుందని తెలిపాడు. అతనిపై తనకు ఆ నమ్మకముందని చెప్పాడు. అంతే కాకుండా రహానె మైదానంలోనైనా, బయటైనా అంత సులభంగా భావోద్వేగానికి గురికాడని పేర్కొన్నాడు. మ్యాచ్‌ పరిస్థితిని చక్కగా అంచనా వేయగలడని తెలిపాడు. స్టాండప్‌ ఆటగాడు శ్రేయాస్‌ అయ్యర్‌ ను కూడా స్మిత్ పొగిడాడు. వార్మప్‌ మ్యాచ్‌ లో శ్రేయస్ దూకుడుగా ఆడి ద్విశతకం బాదాడని గుర్తుచేశాడు. తమ ప్రధాన బౌలర్లను ఎదుర్కోకపోయినా మ్యాచ్ లో స్పూర్తిమంతంగా ఆడాడని తెలిపాడు. తమ ఆటగాళ్ల ప్రదర్శనను కొనియాడిన స్మిత్....టీమిండియా భారత్ లో ఎదుర్కోవడం ఎప్పుడూ కష్టమేనని చెప్పాడు.

  • Loading...

More Telugu News