: ఈవ్ టీజింగ్ ను సహించబోం.. అమాయకుల్ని మాత్రం వేధించడం లేదు: యూపీ డిప్యూటీ సీఎం


ఉత్తరప్రదేశ్‌లో ఇటీవ‌లే అధికారంలోకి వ‌చ్చిన సీఎం యోగి ఆదిత్యానాథ్ స‌ర్కారు ఆ రాష్ట్రంలో ప‌లు కీల‌క నిర్ణ‌యాలు తీసుకుంటూ ముందుకు వెళుతోన్న విష‌యం తెలిసిందే. ఈ క్ర‌మంలోనే అమ్మాయిలను వేధించే పోకిరీల‌ను ప‌ట్టుకునేందుకు యాంటీ రోమియో స్క్వాడ్‌ను ఏర్పాటు చేసి పోకిరీల‌కు బుద్ధి చెబుతోంది. అయితే, ఆ బృందాల‌ను ఉపయోగించుకుని అమాయకులను శిక్షిస్తున్నారంటూ ప్రతిపక్షాల నుంచి వ‌స్తోన్న ఆరోపణలపై ఆ రాష్ట్ర డిప్యూటీ సీఎం కేశవ్‌ప్రసాద్‌ మౌర్య స్పందించారు. తాము అమాయకుల్ని వేధించడం లేదని స్ప‌ష్టం చేశారు. త‌గిన విధంగానే ముందుకు వెళుతున్నామ‌ని అన్నారు. యూపీలో ఈవ్‌ టీజింగ్‌ను సహించబోమ‌ని తెలిపారు. ప్ర‌తిప‌క్షాలు చేస్తోన్న ఆరోప‌ణ‌లు అర్థంలేనివని అన్నారు.

  • Loading...

More Telugu News