: సీరీస్ ఫలితాన్ని తేల్చే చివరి టెస్ట్‌ కోసం టీమిండియాలో కీలక మార్పులు


ధర్మశాల వేదికగా రేపటి నుంచి ఆస్ట్రేలియా, టీమిండియాల మ‌ధ్య సిరీస్ ఫ‌లితాన్ని తేల్చే చివ‌రిటెస్టు జ‌ర‌గ‌నున్న విష‌యం తెలిసిందే. అయితే, రేప‌టి మ్యాచులో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ ఆడే అంశంపై ఇంకా స్ప‌ష్ట‌త లేదు. ఈ నేపథ్యంలో బీసీసీఐ టీమిండియా ఆట‌గాళ్ల‌లో కొన్ని కీలక మార్పులు చేసింది. పేసర్ మహ్మద్ షమీతో పాటు, కోహ్లీ స్థానంలో పిలిపించిన శ్రేయాస్ అయ్యర్‌ను కూడా రేప‌టి టెస్టుకి తీసుకుంది. రేప‌టి మ్యాచులో విరాట్‌ కోహ్లీ ఆడలేని పరిస్థితి వస్తే మార్పులు చేసే అవ‌కాశం ఉన్న‌ట్లు తెలుస్తోంది. రేప‌టి మ్యాచ్‌ కోసం ఎంపిక చేసిన టీమిండియా ఆట‌గాళ్ల వివ‌రాలు చూస్తే.. విరాట్ కోహ్లీ(కెప్టెన్), మురళీ విజయ్, కెఎల్ రాహుల్, పుజారా, అజింక్య రహానే, వృద్ధిమాన్ సాహా(వికెట్ కీపర్), అశ్విన్, జడేజా, ఇషాంత్ శర్మ, భువనేశ్వర్ కుమార్, ఉమేష్ యాదవ్, కరుణ్ నాయర్, జయంత్ యాదవ్, కుల్దీప్ యాదవ్, అభినవ్ ముకుంద్, శ్రేయాస్ అయ్యర్, మహ్మద్ షమీ ఉన్నారు.  

  • Loading...

More Telugu News