: షారూక్ కు వచ్చే నెల షోల్డర్ సర్జరీ


ఎన్నాళ్లుగానో వేధిస్తున్న భుజం గాయానికి సర్జరీ చేయించుకునేందుకు షారూక్ ఖాన్ సిద్దమయ్యాడు. వచ్చే నెల లండన్ వెళ్లనున్నట్లు తెలుస్తోంది. ఇందుకోసమే ప్రస్తుతం దర్శకురాలు రోహిత్ శెట్టి తీస్తున్న 'చెన్నై ఎక్స్ ప్రెస్' చిత్రంలో ఊపిరి సలపకుండా నటిస్తున్నాడట. 2010లో తన సొంత నిర్మాణంలో తీసిన 'రా.వన్' సినిమా షూటింగ్ సమయంలో షారూక్ భుజానికి గాయమైంది. షూటింగుల కారణంగా అప్పటి నుంచీ షారూక్ ఆ గాయాన్ని అలానే వదిలేశాడు. నొప్పి ఎక్కువగా ఉండడంతో వచ్చేనెల సర్జరీ చేయించుకోవాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం.

  • Loading...

More Telugu News