: ‘బాహుబలి-2’ ట్రైలర్ కు 100 మిలియన్ల వ్యూస్.. తాను కూడా ఊహించలేదన్న రాజమౌళి!


ఇటీవ‌లే విడుద‌లైన‌ ‘బాహుబలి: ద కన్ క్లూజన్’ ట్రైల‌ర్ ఎవ్వ‌రూ ఊహించ‌ని విధంగా యూ ట్యూబ్‌లో అత్య‌ధిక వ్యూస్ సాధిస్తూ దూసుకుపోతున్న విష‌యం తెలిసిందే. యూట్యూబ్‌లో ఈ సినిమా ట్రైలర్‌ 100 మిలియన్‌ (10 కోట్లు)లకు పైగా వ్యూస్‌ను సాధించి కొత్త ఒర‌వ‌డి సృష్టిస్తోంది. ఈ ట్రైల‌ర్ కు వ‌స్తోన్న ఆద‌ర‌ణ ప‌ట్ల ఆ సినిమా ద‌ర్శ‌కుడు రాజ‌మౌళి సైతం ఆశ్చ‌ర్యం వ్య‌క్తం చేశారు. '100 మిలియన్లా? ఈ స్థాయిలో ట్రైలర్ చూస్తారని అసలు ఊహించలేద'ని అంటూ రాజ‌మౌళి త‌న ట్విట్ట‌ర్ ఖాతాలో పేర్కొన్నారు. అభిమానులు దీన్ని సాధ్యం చేశారని పేర్కొన్నారు.

  • Loading...

More Telugu News