: అది రహస్యం కాదు... బహిరంగ రహస్యం!: అభిమానితో షాహిద్ కపూర్ చమత్కారం


ప్రముఖ బాలీవుడ్ నటుడు షాహిద్ కపూర్ ఢిల్లీలో ఓ సదస్సులో పాల్గొన్నాడు. ఈ సందర్భంగా ఓ అభిమాని షాహిద్ ను 'రహస్యంగా ఉన్న మీ గతం గురించి చెప్పండి' అంటూ అడిగింది. దీనికి స్పందించిన షాహిద్ కపూర్, 'నాకో రహస్యం ఉందా? ఈ విషయం మీకెలా తెలుసు? నా మీదేమైనా నిఘా పెట్టారా? అయినా మీరు రహస్యమన్నారు కదా? దానిని నేను బయటపెట్టను' అని చమత్కారంగా తప్పించుకునే ప్రయత్నం చేశాడు.

దీంతో వెనుక వరుస నుంచి 'కరీనా కపూర్' అని గట్టిగా అభిమానులు అరవడంతో 'ఓహ్ అదా... అందులో సీక్రెట్ ఏముంది? అందరికీ తెలిసిందే కదా? అది బహిరంగ రహస్యం' అన్నాడు. దీంతో అంతా నవ్వేశారు. కాగా, గతంలో షాహిద్ కపూర్, కరీనా కపూర్ పీకల్లోతు ప్రేమలో మునిగిన సంగతి తెలిసిందే. వీరిద్దరూ కలిసి వివాహం చేసుకుంటారని మీడియాలో కథనాలు వచ్చాయి. అయితే కరీనా సైఫ్ అలీ ఖాన్ ను వివాహం చేసుకుని తైమూర్ ను కనగా, షాహిద్ కపూర్, మిరా రాజ్ పుత్ ను వివాహం చేసుకుని మిసాను కన్నాడు. 

  • Loading...

More Telugu News