: బాహుబలి ఆడియో రిలీజ్ ఈ నెల 26న... ప్రేక్షకులకు వినూత్నమైన అనుభూతినిస్తాం: రాజమౌళి


'బాహుబలి: ద కన్ క్లూజన్' ఆడియో వేడుకను (ప్రీ రిలీజ్ ఫంక్షన్ ను) ఈ నెల 26న నిర్వహించనున్నట్టు ప్రముఖ దర్శకుడు ఎస్ఎస్.రాజమౌళి తెలిపారు. తన ట్విట్టర్ లో వరుస ట్వీట్లతో రాజమౌళి ఈ విషయం వెల్లడించారు. ఈ లైవ్ స్ట్రీమింగ్ ను 360 డిగ్రీల యాంగిల్ లో 4కే నాణ్యతతో అందించనున్నామని పేర్కొన్నారు. ట్రైలర్ ను కూడా వినూత్న అనుభూతితో ప్రేక్షకులు ఆనందించాలని ఈ నిర్ణయం తీసుకున్నానని ఆయన తెలిపారు. మార్చి 26న సాయంత్రం 6:30 గంటల నుంచి ఆస్వాదించాలని సూచించారు. ఇప్పటికే 'బాహుబలి' టీజర్ సోషల్ మీడియాలో విశేషమైన ఆదరణ పొందిన సంగతి తెలిసిందే.






  • Loading...

More Telugu News