: కపిల్ శర్మతో షోపై పునరాలోచనలో పడిన సోనీ టీవీ


కేవలం ఐదేళ్లలోనే హిందీ టీవీ పరిశ్రమలో తిరుగులేని స్టార్ డమ్ సంపాదించుకున్న కమేడియన్ కపిల్ శర్మ కెరీర్ ఇబ్బందుల్లో పడింది. ఒకరకంగా పతనం అంచున పడిందని ఊహించవచ్చు. కమేడియన్ గా మంచి ఆదరణ ఉన్న కపిల్ శర్మ 2013లో కలర్స్ ఛానెల్ లో తన 'కామెడీ నైట్స్ విత్ కపిల్ షో'ను ప్రారంభించాడు. అంతకు ముందు కామెడీ సర్కస్ లో 'జబర్ దస్త్' తరహా స్కిట్లు చేసేవాడు. 2016 వరకు అదే ఛానెల్ తో కొనసాగాడు. సుమారు 191 ఎపిసోడ్లు చేశాడు. ఈ క్రమంలో కపిల్ శర్మ బాలీవుడ్ హీరోగా కూడా మారాడు. అనంతరం రెమ్యూనరేషన్ వివాదంతో కలర్స్ ఛానెల్ ను కపిల్ వీడాడు. ఇదే షోతో సోనీ ఛానెల్ ను సంప్రదించాడు. ప్రస్తుతం సోనీలో 'ద కపిల్ శర్మ షో' పేరుతో ఈ షో నడుస్తోంది.

 ఈ నేపథ్యంలో ఆస్ట్రేలియాలో ఒక షోలో పాల్గొని తిరుగు ప్రయాణంలో విమానంలో సహచరుడు... ఈ షోలో ఒన్ మ్యాన్ షో చేసే సునీల్ గ్రోవర్ పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డాడు. దీంతో కపిల్ తీరుపై సర్వత్రా విమర్శలు పెరిగాయి. ఈ నేపథ్యంలో కపిల్ తో కలిసి పని చేసేందుకు ఎవరూ ఇష్టపడడం లేదు. షో నుంచి సునీల్ గ్రోవర్, అలీ అస్ఘర్, చందన్ ప్రభాకర్ లు తప్పుకోవడంతో షో నిర్వహణ గందరగోళంలో పడింది. బాలీవుడ్ నటులు కూడా కపిల్ షోకు వచ్చేందుకు సానుకూలంగా లేరని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఈ షోని నిర్వహించాలా? వద్దా? అన్న ఆలోచనలో సోనీ టీవీ పడినట్టు తెలుస్తోంది. 

  • Loading...

More Telugu News