: మోదీ టీంలోకి ఐఏఎస్ చంద్రకళ!
ప్రధాని నరేంద్ర మోదీ టీంలో ఉత్తరప్రదేశ్ లో సమర్థవంతమైన ఐఏఎస్ అధికారిగా పేరుతెచ్చుకున్న చంద్రకళ చేరారు. ప్రధాని నరేంద్ర మోదీ కలల ప్రాజెక్టుగా పేర్కొనే స్వచ్ఛ భారత్ మిషన్ ప్రాజెక్టు డైరెక్టర్ గా చంద్రకళను నియమించారు. దానితోపాటు తాగునీరు, పారిశుద్ధ్య శాఖ డిప్యూటీ సెక్రటరీగా కూడా ఆమె బాధ్యతలు నిర్వర్తించనున్నారు. 2008 ఉత్తరప్రదేశ్ కేడర్ కు చెందిన బి.చంద్రకళ బిజ్నూర్, బులంద్షార్ జిల్లాలకు కలెక్టర్ గా విధులు నిర్వర్తించారు. కలెక్టర్ గా పని చేస్తున్న సమయంలో అవినీతి అధికారులు, కాంట్రాక్టర్ల భరతం పడుతూ కఠిన చర్యలు తీసుకున్నారు.
స్కూళ్లలో విద్యార్థుల ప్రతిభ పరీక్షిస్తూ టీచర్లలో మార్పులు తెచ్చేదిశగా చర్యలు చేపట్టారు. దీంతో ఆమె సోషల్ మీడియా స్టార్ గా మారారు. ఆమెకు సోషల్ మీడియాలో భారీ ఎత్తున అభిమానులను కూడా సంపాదించుకున్నారు. సామాన్య ప్రజలకు అందుబాటులో ఉంటూ సమస్యల పరిష్కారినికి కృషి చేయడం, కలెక్టర్ హోదాలో క్లీన్ ఇండియా ఉద్యమంలో చురుగ్గా పనిచేయడాన్ని పరిగణనలోకి తీసుకున్న మోదీ ఆమెను తన డ్రీమ్ ప్రాజెక్టులో భాగం చేశారు. విశేషం ఏమిటంటే, చంద్రకళ తెలంగాణ రాష్ట్రానికి చెందిన వ్యక్తి!