: కెరీర్ పై క్లారిటీ... 2019 వరల్డ్ కప్ ఆడతా: ధోనీ


టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ తన కెరీర్ పై ఒక క్లారిటీ ఇచ్చాడు. ఢిల్లీలో జరిగిన ఒక ఈవెంట్ లో అభిమానులతో ముచ్చటించిన ధోనీ పలు ఆసక్తికర సమాధానాలు చెప్పాడు. అందులో భాగంగా మాట్లాడుతూ, 2019 వరల్డ్ కప్ లో ఆడుతానని అన్నాడు. ఆడగలిగినంత కాలం తాను జట్టులో కొనసాగుతానని చెప్పాడు. ప్రస్తుతానికి తాను చాలా ఫిట్ గా ఉన్నానని తెలిపాడు. ప్రస్తుతం 2017 సంవత్సరం నడుస్తోందని చెప్పిన ధోనీ, 2019లో ఏం జరుగుతుందో మాత్రం చెప్పలేనని అన్నాడు. పదేళ్లుగా తాను టీమిండియాకు ఆడుతున్నానని గుర్తుచేశాడు. పాత ఆటగాళ్లను ఎంపిక చేయాల్సి వచ్చినప్పుడు సెలెక్టర్లు ఎన్ని అంశాలు పరిగణనలోకి తీసుకుంటారో తనకు తెలుసని అన్నాడు. అందుకే అప్పటికి ఫిట్ గా ఉంటే కచ్చితంగా వరల్డ్ కప్ కు అందుబాటులో ఉంటానని చెప్పాడు. 

  • Loading...

More Telugu News