: అధికారంలోకి వచ్చాక వీఆర్ఏలకు రూ.15 వేల వేతనం కచ్చితంగా ఇప్పిస్తా: జగన్
ప్రభుత్వం తమకు అందించే వేతనాలు సరిపోవడం లేదంటూ నిరసన తెలుపుతున్న వీఆర్ఏలకు ఈ రోజు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్‌రెడ్డి మద్దతు తెలిపారు. విజయవాడలో వారి దీక్షాస్థలి వద్దకు వెళ్లిన జగన్ ఈ సందర్భంగా మాట్లాడుతూ వచ్చే అసెంబ్లీ ఎన్నికల తరువాత మనందరి ప్రభుత్వమే వస్తుందని, తమ సర్కారు ఏర్పడిన వారం రోజుల్లోనే వీఆర్ఏలకు రూ.15 వేల వేతనం కచ్చితంగా ఇస్తామని చెప్పారు. ఓ వైపు తెలంగాణలో వీఆర్ఏలకు రూ.10,700 వేతనం ఇస్తున్నారని వ్యాఖ్యానించిన జగన్.. ఏపీలో మాత్రం దయనీయమైన పరిస్థితి ఉందని విమర్శించారు. మనం చెప్పిన విషయాలు చంద్రబాబు చెవికి ఎక్కట్లేదని జగన్ అన్నారు.