: తండ్రి సీఎంగా ఉన్నప్పుడు జగన్ చేసిన అరాచకాలు అన్నీ ఇన్నీ కావు!: కళా వెంకట్రావు
తండ్రి సీఎంగా ఉన్నప్పుడు జగన్మోహన్‌రెడ్డి చేసిన అరాచకాలు అన్నీ ఇన్నీ కావని, జైలుకెళ్లినా ఆయన ప్రవర్తనలో మార్పు రాలేదని ఏపీ టీడీపీ సభ్యుడు కళా వెంకట్రావు అన్నారు. ఈ రోజు ఆయన అసెంబ్లీలో మాట్లాడుతూ... జగన్ తన మనస్తత్వాన్ని మార్చుకోవాలని అన్నారు. జగన్ ఓ వింత ప్రవర్తన కలిగిన వ్యక్తి అని ఆయన చురకలంటించారు. జగన్ అక్రమాల గురించి ప్రజలు టీవీల్లో చూస్తూనే ఉన్నారని చెప్పారు. ఇటువంటి క్యారెక్టర్ ఉన్నవారు అసెంబ్లీలో ఉండడం మన దురదృష్టమని వ్యాఖ్యానించారు. కొడుకులు ఎటువంటి పనులు చేసినా తల్లికి తప్పదు కాబట్టి జగన్ తల్లి భరిస్తున్నారని ఆయన అన్నారు. తండ్రి అధికారంలో ఉన్నప్పుడు జగన్ ఎన్నో అక్రమాలకు పాల్పడ్డారని అన్నారు.