: డోన్ లో రాడ్లు, కర్రలతో దాడులు... వైఎస్సార్సీపీ, టీడీపీ ఘర్షణ...పగిలిన తలలు
ఆంధ్రప్రదేశ్ లోని కర్నూలు జిల్లా డోన్ లో సభ్యసమాజం సిగ్గుతో తలదించుకోవాల్సిన ఘటన చోటుచేసుకుంది. డోన్ మున్సిపల్ దుకాణాల వేలంలో టెండర్లు దక్కించుకునే క్రమంలో టీడీపీ, వైఎస్సార్సీపీ కార్యకర్తలు ఘర్షణకు దిగారు. పోలీసుల సాక్షిగా జరిగిన ఈ ఘటనలో రెండు పార్టీల కార్యకర్తలు కర్రలు, ఇనుప రాడ్లు, కత్తులతో దాడులకు తెగబడ్డారు. మూకుమ్మడిగా దాడులకు దిగడంతో పోలీసులు కూడా వాటిని నియంత్రించలేకపోయారు. ఈ క్రమంలో ఐదుగురు వైఎస్సార్సీపీ కార్యకర్తల తలలు పగిలాయి. లా అండ్ ఆర్డర్ అదుపు తప్పింది. ఈ ఘటనకు సంబంధించిన భయానక దృశ్యాలు టీవీ ఛానెళ్లలో తీవ్ర ఆందోళన రేపుతున్నాయి.