: జంతర్ మంతర్ వద్ద నటులు విశాల్, ప్రకాష్ రాజ్ ధర్నా
తమిళనాడు రైతులకు మద్దతుగా ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద దక్షిణాది నటులు విశాల్, ప్రకాష్ రాజ్ ధర్నాకు దిగారు. తమిళనాడులో కరవు పరిస్థితుల దృష్ట్యా రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని వారు రైతులతో కలిసి ఈ నిరసనలో పాల్గొంటున్నారు. జంతర్ మంతర్ వద్దకు తమిళనాడు రైతులు భారీగా చేరుకున్నారు. మెడలో కపాలాలు ధరించి రైతులు నిరసన తెలుపుతున్నారు. ఈ సందర్భంగా ప్రకాష్ రాజ్ మాట్లాడుతూ రైతుల సమస్యలను ఎవరూ పట్టించుకోవడం లేదని అన్నారు. అందుకే ఈ రోజు అక్కడ తీవ్రస్థాయిలో ధర్నా చేస్తున్నామని పేర్కొన్నారు. వారి సమస్యలపై మంత్రులు స్పందించాలని ఆయన డిమాండ్ చేశారు.