: అంతా బాగుంటేనే ఆడతా: కోహ్లీ


రాంచీ టెస్టులో గాయపడిన తాను, పూర్తి ఫిట్ నెస్ ఉంటేనే ధర్మశాలలో ఆఖరి టెస్టు మ్యాచ్ ఆడతానని కెప్టెన్ విరాట్ కోహ్లీ వెల్లడించాడు. టెస్టులో ఆడేముందు ఫిజియో పాట్రిక్ ఫర్హాత్ తో మాట్లాడుతానని, ఫిట్ నెస్ ను నిరూపించుకుంటేనే తాను ఆడతానని తెలిపాడు. నేటి రాత్రికి లేదా రేపు ఉదయానికి తాను ఆడే విషయంలో స్పష్టత వస్తుందని వివరించాడు. కాగా, మూడో టెస్టులో ఫీల్డింగ్ చేస్తూ, కోహ్లీ గాయపడగా, ముందు జాగ్రత్తగా బీసీసీఐ శ్రేయాస్ అయ్యర్ ను జట్టులోకి పిలిపించిన సంగతి తెలిసిందే. గత సంవత్సరం రంజీ ట్రోఫీలో 1321 పరుగులు చేసిన అయ్యర్, ఆపై ఈ సీజన్ లో ముంబై తరఫున అత్యధిక పరుగులు చేసి సెలక్టర్ల దృష్టిలో పడ్డాడు.

  • Loading...

More Telugu News