: బాహుబలి వేడుకకు ప్రత్యేక అతిథిగా రజనీకాంత్!


వచ్చే నెల 9వ తేదీన చెన్నైలో జరిగే 'బాహుబలి: ది కన్ క్లూజన్' ఆడియో విడుదల వేడుకకు సూపర్ స్టార్ రజనీకాంత్ అతిథిగా హాజరు కానున్నట్టు తెలుస్తోంది. ఆయనతో పాటు పలువురు ప్రముఖ నటీనటులు ఈ కార్యక్రమానికి హాజరు కానున్నారని కోలీవుడ్ వర్గాలు వెల్లడించాయి. ప్రభాస్ బాహుబలిగా, రానా భల్లాలదేవుడిగా నటించిన ఈ చిత్రం వచ్చే నెల 28న ప్రపంచవ్యాప్తంగా సుమారు 7,500 థియేటర్లలో విడుదలకు ముస్తాబైన సంగతి తెలిసిందే. ఆడియో విడుదలకు రజనీ హాజరుపై అధికారిక ప్రకటన వెలువడాల్సి వుంది.

  • Loading...

More Telugu News