: పవన్ సార్ సినిమాలో నటించడం చాలా సంతోషంగా ఉంది: నటుడు అజయ్


పవన్ కల్యాణ్ సినిమాలో ఓ పాత్ర పోషించడమంటే చాలా సంతోషంగా ఉంటుందని నటుడు అజయ్ అన్నాడు. హైదరాబాద్ లోని ఐ మ్యాక్స్ థియేటర్ లో ‘కాటమరాయుడు’ చిత్రం చూసేందుకు వచ్చిన ఆయన్ని మీడియా పలకరించగా, ‘ పవన్ సార్ నటించిన చిత్రంలో నటించడమనేది చాలా సంతోషంగా ఉంది. ఈ చిత్రంలో పవన్ కు సోదరుడిగా నటించాను. ఆయన సినిమాలో నటించడమనేది ముఖ్యం. ఆ పాత్ర చిన్నదా, పెద్దదా? అనేది సమస్య కాదు. ఈ చిత్రానికి పాజిటివ్ టాక్ వచ్చింది. పవన్ ఫ్యాన్స్ తో పాటు ఫ్యామిలీ ఆడియన్స్ కూడా ఈ సినిమాను ఆదరిస్తారు’ అని చెప్పాడు. 

  • Loading...

More Telugu News